W.G: స్కీమ్ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి, కనీస వేతనం రూ. 26,000 వేలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు JVN. గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఆకివీడు మండల సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని గోపాలన్ పిలపునించాడు.