VZM: నూతన సంవత్సరం సందర్భంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కీలక సూచనలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులు, నాయకులు, అధికారులు బొకేలు, పూలమాలలు, సాలువాలు తీసుకురావద్దన్నారు. నిరుపేద విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పుస్తకాలు మాత్రమే తేవాలని ఆయన సూచించారు.