VSP: నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని బొబ్బిలి పట్టణ సీఐ కె. సతీష్ కుమార్ కోరారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపినా, అల్లర్లు చేసినా, బహిరంగంగా మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్ధరాత్రి తర్వాత రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సీఐ హెచ్చరించారు.