SKLM: మందస మండలం డిమిరియా గ్రామంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రహదారి వంతెన తీవ్రంగా దెబ్బతిన్న విషయం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వంతెనను పరిశీలించారు. త్వరలో వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.