BPT: బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖలో విధినిర్వహణలో వినియోగించే ఆధునిక ఆయుధాలు, పరికరాలు, సాంకేతిక ఉపకరణాలను విద్యార్థులకు ఎస్పీ స్వయంగా వివరించారు.