SKLM: మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అరుదైన రికార్డుని అతి చిన్న వయసులో కైవసం చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డికి టెక్కలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలియజేశారు. భారత జట్టుకు కీలకమైన సమయంలో ఇలాంటి స్కోర్ చేయడం నితీష్ ప్రతిభ అని, భవిష్యత్తులో మరింత రాణించాలని అన్నారు.