ELR: నూజివీడు పట్టణంలోని 21,22 వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో కలిసి ఇంటింటికి పర్యటించి ప్రజల నుంచా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీల తీరు, వాటిలో పరిశుభ్రత, రోడ్లపై చెత్తాచెదారం వంటి అంశాలు పరిశీలించారు. చెత్తను రోడ్లపై వేయవద్దని, గ్రీన్ అంబాసిడర్లకు డస్ట్ బిన్స్తో చెత్త అందించాలన్నారు.