సత్యసాయి: రాష్ట్రంలో పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటిలో మడకశిర డివిజన్ ప్రతిపాదనగా ఉందని సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక నియోజకవర్గం ఒకే డివిజన్ పరిధిలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అశాస్త్రీయ విభజనలను సరిదిద్దే క్రమంలో మడకశిరను కొత్త డివిజన్‌గా పరిశీలిస్తున్నారు.