VSP: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విలువకు సరిపడ ప్రభుత్వ భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జీవిఎంసీ వైయస్సార్ పార్క్లో మంగళవారం జరిగిన విశాఖ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, బకాయిలను సర్వీస్ రిజిస్టర్లలో పొందుపరచాలని సూచించారు.