SKLM: ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ఆదివారం ఉదయం ట్రైల్ రన్ నిర్వహించారు. అభ్యర్థులకు ఛాతీ కొలత, ఎత్తు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ సంబంధించి ట్రల్ రన్ దేహదారుఢ్య పరీక్షల సరళని ఎస్పీ పరిశీలించారు.