అన్నమయ్య: చిట్వేల్ మండలంలో ZPHS పాఠశాల వేదికగా మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించగా, ఉత్తమ ప్రతిభ కనబరిచినవి జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని ఉపాధ్యాయులు అన్నారు.