VZM: జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు నాటి నుంచి నేటి వరకు వైద్యరంగాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలుగు యువత నాయకులు తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే వైద్యకళాశాలలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.