NLR: పశువుల్లో పిండ మార్పిడి విధానాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం కొండాపురం మండలంలోని చింతల దేవి పశు సంవర్ధక ఫారంను ఆయనతో పాటు పలువురు అధికారులు సందర్శించారు. వారంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.