సత్యసాయి: సోమందేపల్లి గ్రామపంచాయతీ కార్మికులతో మంగళవారం సీఐటీయూ నాయకులు సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. ఈనెల 17న విజయవాడలో నిర్వహించే ధర్నాకు కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి ప్రభుత్వమే వేతనాలు చెల్లించే విధంగా గుర్తింపు కార్డులు, PF, ESI, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.