అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
Tags :