కృష్ణా: గన్నవరంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళల జట్ల ఎంపికలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 14,15 తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.