కోనసీమ: దీపం జ్ఞానానికి ప్రతీక అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి ప్రముఖ శైవ క్షేత్రం పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తిక దీపోత్సవం, అన్న సమారాధన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.