కృష్ణా: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రధం గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ళ, పెసరమిల్లి గ్రామాలలో సోమవారం పర్యటించింది. గ్రామస్తులు తెచ్చిన డ్రై వేస్ట్‌ను స్వచ్ఛ రథం వాహనదారుడికి అందజేశారు. పరిమాణం, దాని విలువను రూపాయలలో వాహనదారుడు నమోదు చేశాడు. అనంతరం ఆ మొత్తానికి సరిపోయే సరుకులను గ్రామస్తులకు అందజేశాడు.