VSP: జైల్ రోడ్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ తొలగింపుని కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ ఇంఛర్జ్ ప్రియాంక దండి శనివారం ఖండించారు. కార్పొరేట్లకి ఎకరా స్థలం 1 రూపాయికి ఇస్తున్న ప్రభుత్వం పేదలతో అన్యాయం చేస్తోందని విమర్శించారు. స్ట్రీట్ వెండర్లకు తాత్కాలికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా ఖాళీ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.