GNTR: రాష్ట్రంలోని చిన్న జీతాలు తీసుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ తెలిపారు. సోమవారం తుళ్లూరు మండలం రాయపూడిలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ రూ.12 వేల జీతం వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు లభించడం లేదని ఆయన చెప్పారు.