BPT: జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, అధికారి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘విజిటింగ్ అవర్స్’ పాటించాలని, ఈ సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.