ATP: తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం 10వ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకోశమున స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. స్వామివారికి ద్వాదశ ఆరాధన, ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.