ATP: కనేకల్ మండలంలో వెలసిన చిక్కనేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య కళ్యాణోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు.