ASR: కొయ్యూరు మండలం కాకరపాడులో వినాయకుని గుడిని 516-ఈ హైవే నిర్మాణంలో తొలగించారు. దీంతో గ్రామస్తులు గుడికి స్థలం కేటాయించాలని కలెక్టర్కు వినతి అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో డీటీ కుమారస్వామి, ఆర్ఐ రాజన్నదొర కాకరపాడు వచ్చి స్థల పరిశీలన చేశారని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం తెలిపారు. 59-1 సర్వే నెంబర్ లో 2సెంట్ల భూమిని కేటాయించారన్నారు.