JN: వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. తడవకుండా టార్ఫాలీన్లు కప్పి ఉంచాలని, రవాణాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.