పనులు చేయడం, ఎక్కువ సేపు కూర్చోవడం, కండరాలు క్షీణించడం వంటి కారణాలతో నడుంనొప్పి వస్తుందని అనుకుంటారు. కానీ షూ, చెప్పులు సరిగ్గా లేకపోయినా నడుం నొప్పి వస్తుందని తెలుసా? అవును. ఇవి నడకను, కదలికలను, పాదాల మీద పడే ఒత్తిడిని గ్రహించుకోవటాన్ని ప్రభావితం చేస్తాయి. షూ, చెప్పులు సరిగ్గా లేకపోతే పాదాలపై ఒత్తిడి పెరిగి.. వెన్నెముక మీదా ప్రభావం చూపుతుంది.