GDWL: గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రెస్, పోలీసుల మధ్య క్రికెట్ పోటీలను సోమవారం నిర్వహించారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో కలెక్టర్ సంతోష్ స్వయంగా బ్యాటర్‌గా మారి, పలువురు బౌలర్లు విసిరిన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆయన ఆట తీరు ప్రేక్షకులు ఉత్సాహపరిచింది.