BPT: బాపట్ల నియోజకవర్గంలోని 84 మందికి మంజూరైన రూ.46 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. శుక్రవారం బాపట్ల టీడీపీ కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేసిన ఆయన, పేదలకు మెరుగైన చికిత్స అందించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారని తెలిపారు.