WG: ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో పెనుగొండ రోడ్డులో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము భక్తలు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.