NZB: కమ్మర్పల్లి మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన BRS కార్యకర్త, తన అభిమాని మెట్టు సాయన్న కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మెట్టు సాయన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి సభ్యులకు రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు.