NZB: నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న జీవనశైలి వ్యాధులపై DM&HO డాక్టర్ బీ రాజశ్రీ గురువారం సమీక్ష నిర్వహించారు. వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్స, రిఫరల్ సర్వీసెస్‌పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె చర్చించారు. డబుల్ ఎంట్రీ, డమ్మీ ఎంట్రీ లాంటివి చేయరాదని సూచించారు.