KRNL: విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలులోని టౌన్ మోడల్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.