భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రెండో సెషన్లో భారత్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లులో రూట్(54*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పోప్(44*) కూడా హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.