SKLM: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీకాకుళం ఆర్డీవో కే సాయి ప్రత్యూష పిలుపునిచ్చారు. మండలంలోని కొండపోలవలస గ్రామంలో స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు.