E.G: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజమండ్రి సీటీ నియోజకవర్గానికి CSR నిధుల కింద రూ.7.39 కోట్లు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆ నిధులను ఉపయోగించామన్నారు. సోమవారం రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో CSR నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.