NDL: బేతంచర్ల పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలోని ఎంపీపీ స్కూలును ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తనిఖీ చేశారు. బుధవారం పాఠశాల తనిఖీలో భాగంగా పాఠశాల రికార్డులను, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాల ఆవరణం శుభ్రంగా లేదని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈఓ సోమశేఖర్‌కు ఎమ్మెల్యే సూచించారు.