కృష్ణా: కప్పలదొడ్డి గ్రామంలో రూ.4 లక్షల మండల పరిషత్ గ్రాంట్తో నిర్మించనున్న డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం జరిగింది. గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాలను గుర్తించి, గతంలోనే మండల పరిషత్ గ్రాంట్ మంజూరు చేశారు. డ్రైనేజీ అవసరాల కోసం కూడా నిధులు కేటాయించినందుకు గ్రామ సర్పంచ్ యక్కల మాధవి మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు.