KRNL: ఎమ్మిగనూరులోని అన్న క్యాంటీన్ అల్పాహారాన్ని ఉదయం మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి తనిఖీ చేశారు. బుధవారం పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు గల అన్న క్యాంటీన్లో అల్పాహార ఏర్పాట్లు తనిఖీ చేశానని ఆయన తెలిపారు. అనంతరం ఇందిరా నగర్ ఏరియాలో పారిశుద్ధ్య పనులను పరిశీలించామని పేర్కొన్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.