NLR: తొలిపంట పూర్తికావడంతో కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పూడిక, గుర్రపుడెక్కతో నిండిన 30 ప్రధాన, 120 ఇతర కాలువలను శుభ్రం చేయాలి. దెబ్బతిన్న రెగ్యులేటర్లు బాగుచేయాలి. మే 15న రబీ సాగు ప్రారంభంకానున్నందున, ఉన్న నిధులతో తక్షణమే అధికారులు స్పందించి పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.