TPT: స్విమ్స్ కార్మికుల పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతోందని సీఐటీయూ తెలిపింది. హామీలు అమలు చేయకపోతే సంపూర్ణ సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. 38 రోజులుగా నిరసన కొనసాగుతున్నా యాజమాన్యం స్పందించలేదని విమర్శించారు. వార్డుబాయ్స్గా గుర్తింపు, జీతాల పెంపు వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.