KDP: ముద్దనూరు మండల పరిధిలోని నల్లబల్లి గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణ పనులను శుక్రవారం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రామలింగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా పనుల నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ భూగర్భజలాల నిల్వకు, పంటలాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఈ మేరకు ప్రతి నీటి బొట్టును వడసి పట్టే బాధ్యత మనందరిదన్నారు.