ASR: మహిళలకు విద్య అందించేందుకు సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని జీకేవీధి మండలం రింతాడ ప్రభుత్వోన్నత పాఠశాల హెచ్ఎం అప్పలరాజు, ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పాఠశాలలో నిర్వహించారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ధీరవనిత పూలే అని కొనియాడారు. చదువుతోనే మహిళలకు సాధికారత సాధ్యమని ప్రగాఢంగా నమ్మారన్నారు.