SKLM: ఆమదాలవలస – పాలకొండ ప్రధాన రహదారిలో ఆమదాలవలస నుంచి అక్కులపేట గ్రామం వరకు రోడ్డు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా జంగిల్ ముళ్ళు పొదలు పేరుకుపోవడంతో, మలుపులు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తెలిపారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని అన్నారు.