అనకాపల్లి: మునగపాక మండలం రాజుపేట, నారాయుడుపాలెం గ్రామాల్లో ఆదివారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.