ELR: ఉమ్మడి ప.గో జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికైన 1064 మంది టీచర్లు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. ఈమేరకు ఎంఈవోలకు, హెచ్ఎంలకు, కొత్త టీచర్లకు డీఈవో వెంకట లక్ష్మమ్మ పలు సూచనలు చేశారు. విధుల్లో చేరే వారు అపాయింట్మెంట్ ఆర్డర్, సంబంధిత ధృవ పత్రాలు తీసుకువెళ్లి విధుల్లో చేరాలన్నారు.