అన్నమయ్య: రామసముద్రం మండలానికి రాయితీపై ప్రభుత్వం 300 క్వింటాళ్ల ఉలవలు కేటాయించినట్లు AO జాఫర్ తెలిపారు. వీటి కోసం రైతులు రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, జింక్ సల్ఫేట్, ఫాస్ఫరస్ solubilizing బ్యాక్టీరియా, పొటాష్ solubilizing బ్యాక్టీరియా రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.