E.G: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తూ.గో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.