E.G: జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు 2026-2027 రెండేళ్ల కాలపరిమితికి సంబంధించిన సమాచార-పౌర సంబంధాల శాఖ అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. గతంలో జారీ చేసిన కార్డుల గడువు నవంబర్ 30తో ముగిసిందన్నారు. ఈ మేరకు నూతన అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.