ప్రకాశం: రిలయన్స్ ఏర్పాటు చేసే బయో ఇంధన ప్రాజెక్ట్‌లో భాగంగా కనిగిరిలో తొలి యూనిట్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వచ్చేనెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లోకేష్ మంగళవారం ప్రకటించారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 1,200 ఎకరాలు అవసరమని, దానికి అనుబంధంగా మరో 30వేల ఎకరాలు గడ్డి పెంపకానికి భూములు అవసరం అని గుర్తించారు.