మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. మార్కాపురం తెలుగు ప్రజలు సంక్రాంతి కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకోవాలని కోరారు.